‘కనబడుటలేదు’.. టీజర్ విడుదల ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2020-08-08T00:20:33+05:30 IST
బాలరాజు రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ‘కనబడుటలేదు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్ర దర్శకుడు

బాలరాజు రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ‘కనబడుటలేదు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కథానాయకుడు సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడగట్టిన కొన్ని ఫొటోల వంక సీరియస్‌గా చూస్తుండటం ఆసక్తిని కలిగించడంతో పాటు సినిమాపై ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ టీజర్‌ను ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్‌లో ప్రకటించారు. అలాగే ఈ టీజర్‌ను శనివారం (ఆగస్ట్ 08) ఉదయం 10గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్లుగా తెలిపారు. టీజర్ విడుదల ప్రకటన నిమిత్తం విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. యుగ్ రామ్, శశిత కోన, నీలిమ పెతకంశెట్టి, సౌమ్య శెట్టి, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమామహేశ్వర రావు, కిశోర్, శ్యామ్, మధు కీలక పాత్రధారులైన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. సరయు తలశిల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మధు పొన్నాస్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ కుర్మాన ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Read more