రజినీకాంత్‌ పొలిటికల్‌ ప్రకటనపై కమల్‌హాసన్‌ స్పందన

ABN , First Publish Date - 2020-12-29T21:32:17+05:30 IST

ఆరోగ్య సమస్యలతో తాను పొలిటికల్ పార్టీ పెట్టడం లేదన్న రజినీకాంత్ పై కమల్ స్పందించారు

రజినీకాంత్‌ పొలిటికల్‌ ప్రకటనపై కమల్‌హాసన్‌ స్పందన

రాజకీయ రంగ ప్రవేశంపై డిసెంబర్‌ 31న ప్రకటన చేస్తానని ప్రకటించిన రజినీకాంత్‌కు ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. హై బీపీ కారణంగా ఆయన హాస్పిటల్‌లో ఉండి డిశ్చార్జ్‌ అయ్యారు. డాక్టర్స్‌ వారం రోజుల పాటు పూర్తిగా రెస్ట్‌ అవసరం అని సూచించారు కూడా. ఈ ఆరోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయ పార్టీని పెట్టడం లేదని రజినీకాంత్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనిపై రజినీకాంత్‌ స్నేహితుడు, ప్రముఖ కథానాయకుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ స్పందించారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజినీకాంత్‌ను కలుస్తానని చెప్పారు. రజినీకాంత్ ప్రకటనపై ఆయన అభిమానుల్లాగే తాను కూడా నిరాశ చెందానని కమల్ చెప్పారు. రజినీకాంత్ ఆరోగ్యమే తనకు ముఖ్యమని కమల్‌హాసన్‌ తెలిపారు.

Updated Date - 2020-12-29T21:32:17+05:30 IST