కమెడియన్ చిత్రంలో కమల్ హిట్ సాంగ్
ABN, First Publish Date - 2020-08-26T14:59:26+05:30
సంతానం హీరోగా నటిస్తోన్న చిత్రంలో కమల్‌హాసన్ నటించిన ‘మైఖేల్ మదన కామరాజన్’ సూపర్ హిట్‌చిత్రంలోని ‘వచ్చాలుమ్ వైక్కామల్’ అనే పాట ఉంటుందని నిర్మాత తెలిపారు.
హాస్యనటుడు సంతానం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డిక్కిలోనా’. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానంతోపాటు యోగిబాబు, ఆనంద్‌రాజ్, అనగా, షెరీన్, మునీస్‌కాంత్, ‘నాన్ కడవుల్’ రాజేంద్రన్, చిత్రాలక్ష్మణన్, అరుణ్ అలెగ్జాండర్, నియల్‌గళ్ రవి, యూట్యూబ్ ప్రసాద్ తదితరులు నటించారు. కేజేఆర్ స్టూడియోస్ సమర్పణలో శీనిష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్ నటించిన ‘మైఖేల్ మదన కామరాజన్’ సూపర్ హిట్‌చిత్రంలోని ‘వచ్చాలుమ్ వైక్కామల్’ అనే పాట ఉంటుందని నిర్మాత తెలిపారు. ఆ పాట హక్కులను ఇళయరాజా నుంచి పొంది, కొద్దిగా పాశ్చాత్య సంగీతాన్ని జోడించి ఆ పాటను ఈ చిత్రంలో చేర్చినట్లు చెప్పారు. ఈ పాట కూడా ‘డిక్కిలోనా’ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని సంతానం తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సుమారు ఎనిమిది మిలియన్ల ప్రేక్షకులు తిలకించి రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు.