బాలుకి భారతరత్న: ఏపీ సీఎంకు కమల్‌ అభినందనలు

ABN , First Publish Date - 2020-09-29T03:40:11+05:30 IST

గాన గంధర్వుడు ఎస్‌. పి. బాలుకు భారతరత్న ఇవ్వాలని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నోట మొట్టమొదటిగా వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ

బాలుకి భారతరత్న: ఏపీ సీఎంకు కమల్‌ అభినందనలు

గాన గంధర్వుడు ఎస్‌. పి. బాలుకు భారతరత్న ఇవ్వాలని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నోట మొట్టమొదటిగా వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే కోరుతున్నారు. తాజాగా ఏపీ సీఎం వైస్‌ జగన్‌.. బాలుకి భారతరత్న ఇవ్వాలంటూ భారత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు గొప్పతనం గురించి వివరిస్తూ.. ఎస్‌.పి. బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం తరపున మోదీని జగన్‌ కోరారు. ఇక బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరిన జగన్‌ను ట్విట్టర్‌ ద్వారా అభినందించారు లోకనాయకుడు కమల్‌ హాసన్‌.
''గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మన సోదరుడు శ్రీ. ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. ఒక్క తమిళనాడే కాదు.. దేశమంతా ఇదే కోరుకుంటుంది.." అని కమల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-09-29T03:40:11+05:30 IST