సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమితాబ్‌కు కమల్‌ బర్త్‌డే విశెష్‌

ABN, First Publish Date - 2020-10-12T02:30:43+05:30

యావద్భారతాన్నీ తనదైన అభినయంతో అలరించిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 11). నేటితో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యావద్భారతాన్నీ తనదైన అభినయంతో అలరించిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 11). నేటితో ఆయన 78 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన నటనతో ప్రతి యేటా తన కీర్తిని పెంచుకుంటున్న నా మిత్రుడు అమితాబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్‌. ట్విట్టర్‌ వేదికగా ఆయన అమితాబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


''అమితాబ్ ఎప్పటికీ నాకు మంచి మిత్రుడే. నటనతో ప్రతి యేటా ఆయన కీర్తి ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతూనే ఉంటుంది. ఓ స్ఫూర్తిప్రదాత, తరతరాలుగా భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అమితాబ్.. ఇలానే ఆయురారోగ్యాలతో ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.." అని కమల్‌ హాసన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2020-10-12T02:30:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!