అమితాబ్‌కు కమల్ బర్త్‌డే విశెష్
ABN , First Publish Date - 2020-10-12T02:30:43+05:30 IST
యావద్భారతాన్నీ తనదైన అభినయంతో అలరించిన బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ పుట్టినరోజు నేడు(అక్టోబర్ 11). నేటితో ఆయన

యావద్భారతాన్నీ తనదైన అభినయంతో అలరించిన బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ పుట్టినరోజు నేడు(అక్టోబర్ 11). నేటితో ఆయన 78 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన నటనతో ప్రతి యేటా తన కీర్తిని పెంచుకుంటున్న నా మిత్రుడు అమితాబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ట్విట్టర్ వేదికగా ఆయన అమితాబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
''అమితాబ్ ఎప్పటికీ నాకు మంచి మిత్రుడే. నటనతో ప్రతి యేటా ఆయన కీర్తి ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతూనే ఉంటుంది. ఓ స్ఫూర్తిప్రదాత, తరతరాలుగా భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అమితాబ్.. ఇలానే ఆయురారోగ్యాలతో ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.." అని కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read more