షూటింగ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించిన ‘ఇండియన్ 2’ టీమ్

ABN , First Publish Date - 2020-08-07T03:33:21+05:30 IST

‘ఇండియన్ -2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ నాలుగు కోట్ల నష్ట పరిహారాన్ని

షూటింగ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించిన ‘ఇండియన్ 2’ టీమ్

‘ఇండియన్ -2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ నాలుగు కోట్ల నష్ట పరిహారాన్ని అందజేశారు. ఫిబ్రవరి నెలలో చెన్నై‌కి సమీపంలో ఉన్న ఈవీపీ ఫిలిం సిటీలో ఇండియన్ -2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ కిందపడడంతో షూటింగ్ సిబ్బంది ఇద్దరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు సహా ముగ్గురు మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ప్రమాదంలో నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ తృటిలో తప్పించుకున్నారు .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 


ఇదిలా ఉండగా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ తరపున తలా కోటి రూపాయిలు, లైకా నిర్మాణసంస్థ తరపున 2 కోట్ల రూపాయిలను బాధిత కుటుంబాలకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ అందజేశారు. అనంతరం కమలహాసన్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో రానున్న కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఇకపై తను తీయబోతున్న సినిమాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని దర్శకుడు శంకర్ భావోద్వేగానికి లోనయ్యారు.Updated Date - 2020-08-07T03:33:21+05:30 IST