బిగ్‌బాస్: కమల్ నోట.. శ్రీశ్రీ కవిత!

ABN , First Publish Date - 2020-11-17T15:24:03+05:30 IST

మహాకవి శ్రీశ్రీకి విశ్వనటుడు కమల్ హాసన్ వీరాభిమాని. శ్రీశ్రీ రచన `మహాప్రస్థానం` అంటే కమల్‌కు మరింత ఇష్టం.

బిగ్‌బాస్: కమల్ నోట.. శ్రీశ్రీ కవిత!

మహాకవి శ్రీశ్రీకి విశ్వనటుడు కమల్ హాసన్ వీరాభిమాని. శ్రీశ్రీ రచన `మహాప్రస్థానం` అంటే కమల్‌కు మరింత ఇష్టం. తమిళుడైన కమల్‌ `మహాప్రస్థానం` కవితలను అనర్గళంగా చెప్పగలరు. గతంలో `ఆకలిరాజ్యం`, `మహానది` వంటి సినిమాల్లో కూడా కమల్ ఈ కవితలను ప్రస్తావించారు. 


తాజాగా బిగ్‌బాస్ కార్యక్రమంలో కమల్ `ప‌తితులార.. భ్ర‌ష్టులారా..' క‌విత‌ను వినిపించారు. ఇటీవల దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌తో కలిసి వేడుక చేసుకున్న కమల్ ఆ సందర్భంగా `మహాప్రస్థానం` గురించి, శ్రీశ్రీ గురించి మాట్లాడారు. త‌మిళంలో భార‌తీయా‌ర్ వలే తెలుగులో శ్రీశ్రీ మహాకవి అని అన్నారు. `సుంద‌ర తెలుంగు` అంటూ తెలుగు భాషను భార‌తీయార్ కీర్తించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 


Updated Date - 2020-11-17T15:24:03+05:30 IST