రెహ్మాన్ పాటలు నచ్చేవి కావు: కమల్

ABN , First Publish Date - 2020-06-15T23:15:30+05:30 IST

ఆస్కార్ అవార్డు దక్కించుకుని భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకుడిగా నిలిచారు ఏఆర్ రెహ్మాన్.

రెహ్మాన్ పాటలు నచ్చేవి కావు: కమల్

ఆస్కార్ అవార్డు దక్కించుకుని భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకుడిగా నిలిచారు ఏఆర్ రెహ్మాన్. అలాంటి వ్యక్తి స్వరపరిచిన పాటలు మొదట్లో తనకు నచ్చేవి కావని విశ్వనటుడు కమల్‌హాసన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇటీవలె రెహ్మాన్‌తో కలిసి సోషల్ మీడియా లైవ్‌లో పాల్గొన్న కమల్ `భారతీయుడు` నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. 


`నేను ఇళయరాజా గారి పాటలను ఎక్కువగా ఇష్టపడేవాడిని. రెహ్మాన్ పాటలు మొదట్లో నాకు పెద్దగా నచ్చేవి కావు. `భారతీయుడు` సినిమా కోసం రెహ్మాన్ చేసిన ఓ పాట ట్యూన్ నాకు నచ్చలేదు. ఆ పాట వద్దని దర్శకుడు శంకర్‌కు కూడా చెప్పాను. కానీ, ఆయన మాత్రం చాలా నమ్మకంతో ఆ పాటను ఉంచారు. పాట షూటింగ్ పూర్తయి ఫైనల్ మిక్సింగ్ కూడా అయిన తర్వాత వింటే ఆ పాట నాకూ చాలా  నచ్చింద`ని కమల్ చెప్పారు. 

Updated Date - 2020-06-15T23:15:30+05:30 IST