`డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` టైటిల్ లోగో విడుదల!
ABN , First Publish Date - 2020-12-25T18:21:43+05:30 IST
`118` వంటి హిట్ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కించిన చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`

`118` వంటి హిట్ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తెరకెక్కించిన చిత్రం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` (హూ, వేర్, వై). థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను రవి పి.రాజు దాట్ల నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ చిత్రం టైటిల్ లోగోను నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. `గుహన్ గారు చాలా పెద్ద టెక్నీషియన్. దర్శకుడిగా ఆయన జర్నీ నా`118` సినిమాతో ప్రారంభమైనందుకు హ్యాపీగా ఉంది. నాకు మరపురాని హిట్ ఇచ్చారు. నాకు అత్యంత ఆప్తులు. ఆయన ఏం చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` కథ విన్నాను. చాలా బాగుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంద`ని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more