కల్యాణ్‌ దేవ్‌ మూడో సినిమా షురూ!

ABN , First Publish Date - 2020-11-13T06:11:49+05:30 IST

కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో నూతన చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది....

కల్యాణ్‌ దేవ్‌ మూడో సినిమా షురూ!

కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రమణ తేజ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో నూతన చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. సాయిరిషిక సమర్పణలో ఎస్‌.ఆర్‌.టి, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీ తాళ్లూరి, రవి చింతల నిర్మాతలు. దేశరాజ్‌ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సెట్స్‌ మీదకు తీసుకెళ్లబోతున్నారు. దీపావళి పండుగ రోజున ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించనున్నారు.  వెంకీ కుడుముల, ప్రణీత్‌, వేణు ఊడుగల పూజా కార్యక్రమాల్లో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


Updated Date - 2020-11-13T06:11:49+05:30 IST