`కిన్నెరసాని`తో వస్తున్న మెగా అల్లుడు!

ABN , First Publish Date - 2020-11-14T18:02:20+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ హీరోగా డైరెక్టర్ రమణ తేజ రూపొందించబోతున్న సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు.

`కిన్నెరసాని`తో వస్తున్న మెగా అల్లుడు!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా డైరెక్టర్ రమణ తేజ రూపొందించబోతున్న సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు `కిన్నెరసాని` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.


ఈ టైటిల్ పోస్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే రీతిలో ఉంది. సముద్రపు ఒడ్డున ఒక పుస్తకానికి గొలుసుతో తాళం వెయ్యడాన్ని టైటిల్ పోస్టర్‌లో చూపించారు. మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. 

Updated Date - 2020-11-14T18:02:20+05:30 IST