సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘కళాపోషకులు’.. వచ్చేస్తున్నారు

ABN, First Publish Date - 2020-12-07T00:22:53+05:30

అలాగే ఇండస్ట్రీలోని పెద్దలు కొంత మందికి షోస్ వేసి చూపించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా తీశారు.. చాలా అద్భుతంగా ఉందని కంగ్రాట్స్ చెప్పారు. వారిలానే ప్రేక్షకులు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్న .. ‘కళాపోషకులు’వచ్చేస్తున్నారు అని చెబుతోంది కళాపోషకులు టీమ్‌. విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని డిసెంబర్ 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చిత్ర విడుదల విషయాలను తెలియజేశారు.


ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ.. '' మా చిత్రం కళాపోషకులు సెన్సార్ పూర్తి చేసుకుని.. సెన్సార్‌ నుంచి యు/ఏ సర్టిఫికెట్‌ని పొందింది. ఈ సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే చిత్రం అని అప్రిషియేట్ చేశారు. అలాగే ఇండస్ట్రీలోని పెద్దలు కొంత మందికి షోస్ వేసి చూపించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా తీశారు.. చాలా అద్భుతంగా ఉందని కంగ్రాట్స్ చెప్పారు. వారిలానే ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాం...." అని తెలిపారు.


నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్‌, పాటలకి మంచి స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. దర్శకుడు చలపతి పువ్వల ఒక మంచి చిత్రాన్ని రూపొందించాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో చక్కగా సహకరించారు. టీమ్‌ వర్క్‌ చక్కగా కుదిరింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. వారందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఎంటర్‌టైన్మెంట్ మూవీ తీశారని అభినందించారు. డిసెంబర్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మా కళాపోషకులు చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం.." అని అన్నారు.

Updated Date - 2020-12-07T00:22:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!