దీపావళి నుంచి సినిమా ప్రదర్శనలు : కాకినాడ ఎగ్జిబిటర్స్

ABN , First Publish Date - 2020-10-08T14:51:58+05:30 IST

దీపావళి నుంచి తూర్పుగోదావరి జిల్లా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించామని

దీపావళి నుంచి సినిమా ప్రదర్శనలు : కాకినాడ ఎగ్జిబిటర్స్

దీపావళి నుంచి తూర్పుగోదావరి జిల్లా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించామని జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సమావేశం కాకినాడ లక్ష్మీ థియేటర్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుంచి సినిమా ప్రదర్శనలకు అనుమతించాయి. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల థియేటర్లను వెంటనే తెరవడం సాధ్యం కావడం లేదు. నిర్మాతల సహకారంతో దీపావళికి థియేటర్లు తెరవాలని నిర్ణయించకున్నాం. లాక్‌డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేస్తామని సినీ పెద్దల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల`ని కోరారు. 

Updated Date - 2020-10-08T14:51:58+05:30 IST