`మీటూ` తర్వాత పరిస్థితి మారింది: కాజోల్
ABN , First Publish Date - 2020-03-04T17:15:49+05:30 IST
ఇటీవల భారీ స్థాయిలో జరిగిన `మీటూ` ఉద్యమం తర్వాత పరిస్థితి మారిందని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ వ్యాఖ్యానించింది.

ఇటీవల భారీ స్థాయిలో జరిగిన `మీటూ` ఉద్యమం తర్వాత పరిస్థితి మారిందని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ వ్యాఖ్యానించింది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్‌లో కొంతమంది ప్రముఖుల పేర్లు వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నానా పటేకర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ ఉద్యమం గురించి తాజాగా కాజోల్ స్పందించింది. ``మీటూ` ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితి మారింది. మగాళ్లు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలు, హీరోయిన్లతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత మెరుగుపడుతుంద`ని కాజోల్ వ్యాఖ్యానించింది.
Read more