బాయ్‌ఫ్రెండ్‌తో కాజల్.. పిక్స్ వైరల్!

ABN , First Publish Date - 2020-10-12T19:25:38+05:30 IST

టాలీవుడ్‌లో దాదాపు దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్‌గా కొనసాగింది చందమామ కాజల్ అగర్వాల్

బాయ్‌ఫ్రెండ్‌తో కాజల్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్‌లో దాదాపు దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్‌గా కొనసాగింది చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగానే ఉన్న కాజల్ ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది. 


తాజాగా వీరికి సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఎప్పట్నుంచో పరిచయం ఉందని ఈ ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది. వీరిద్దరూ ఎప్పట్నుంచో స్నేహితులని ఆ తర్వాత ప్రేమికులుగా మారారని సమాచారం. అయితే కాజల్ స్వయంగా ప్రకటించే వరకు వీరి రిలేషన్ షిప్ గురించిన వార్తలు బయటకు రాలేదు. ఈ నెల 30 తేదీన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-10-12T19:25:38+05:30 IST

Read more