ఆలస్యమైందని తెలుసు: కాజల్

ABN , First Publish Date - 2020-11-04T15:57:11+05:30 IST

ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని తనకు తెలుసని, ఇది ఎప్పుడో చేయాల్సిందని ట్వీట్ చేసింది చందమామ కాజల్ అగర్వాల్

ఆలస్యమైందని తెలుసు: కాజల్

ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని తనకు తెలుసని, ఇది ఎప్పుడో చేయాల్సిందని ట్వీట్ చేసింది చందమామ కాజల్ అగర్వాల్. ఇటీవలె తన ప్రేమికుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని కాజల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా కోవిడ్ గురించి స్పందిస్తూ ఓ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 


`కొద్దిగా ఆలస్యమైందని తెలుసు. ఇది ఎప్పుడో చేసుండాల్సింది. ఒక చిన్న వైరస్‌ నేను ప్రపంచాన్ని చూసే దృష్టి కోణాన్నే మార్చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎవరో తెలియని, ఎప్పుడూ చూడని శత్రువుతో పోరాడాల్సి రావడం భయంకరం. భయంతో బతకడం తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంపై నా దృక్పథమే మారిపోయింది. నేను జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితికి, ఇలాంటి భయానికి `నో` చెప్తున్నాను. వైరస్‌తో పోరాటం మొదలుపెట్టి ఇప్పటికే 11 నెలలు అయిన నేపథ్యంలో అందరూ ఇంతకంటే మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలి. అడుగు బయటపెట్టిన తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాల మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నా కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ముందు ఇదంతా మీతో పంచుకోవాలనుకున్నాను. సురక్షిత ప్రపంచానికి మాత్రమే నేను ప్రాధాన్యం ఇస్తాన`ని కాజల్ ట్వీట్‌ చేసింది.Updated Date - 2020-11-04T15:57:11+05:30 IST

Read more