ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు: కాజల్

ABN , First Publish Date - 2020-09-07T21:25:30+05:30 IST

ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసని, ఆ విషయంలో వారికి ఎవరి సలహాలూ అక్కర్లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేర్కొంది.

ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు: కాజల్

ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసని, ఆ విషయంలో వారికి ఎవరి సలహాలూ అక్కర్లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేర్కొంది. ఇటీవల బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వ్యాయామం చేస్తున్న హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కవిత అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంయుక్త స్నేహితురాలిపై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. పార్కులో ఉన్న మిగతావాళ్లు కూడా సంయుక్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు సంయుక్తకు మద్దతుగా నిలిచారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సంయుక్తకు మద్దతుగా ట్వీట్ చేసింది. `ఓ మై గాడ్.. సామ్! ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. మిస్ కవితా రెడ్డి.. మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని పరిష్కరించుకోండి. మీ దుందుడుకు స్వభావానికి, చిరాకుకు మూలం ఏంటో తెలుసుకోండి. అన్నింటికీ మించి ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు. సలహాలు ఇవ్వడం మానుకోండి. ఎవరి పని వారు చూసుకుంటే మంచిద`ని కాజల్ కౌంటర్ ఇచ్చింది. 

Updated Date - 2020-09-07T21:25:30+05:30 IST