కాజల్‌ పెళ్లికూతురాయనే!

ABN , First Publish Date - 2020-10-30T07:25:27+05:30 IST

కాజల్‌ పెళ్లి హడావిడి మొదలైంది. మరికొన్ని గంటల్లో ‘టాలీవుడ్‌ చందమామ’ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పేసి వైవాహిక జీవితంలోకి...

కాజల్‌ పెళ్లికూతురాయనే!

కాజల్‌ పెళ్లి హడావిడి మొదలైంది. మరికొన్ని గంటల్లో ‘టాలీవుడ్‌ చందమామ’ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. శుక్రవారం గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ ఏడడుగులు నడవబోతున్నారు. ఇప్పటికే పెళ్లి సందడి షురూ అయింది. ముంబైలోని కాజల్‌ నివాసంలో మెహందీ ఫంక్షన్‌ జరిగింది. రెండు చేతులకీ మెహందీ పెట్టుకుని సందడి చేస్తున్న ఫొటోల్ని కాజల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌  చేశారు. మరోవైపు పెళ్లికొడుకు గౌతమ్‌ కిచ్లు ఇంట్లో కూడా సంప్రదాయబద్ధంగా పెళ్లివేడుక మొదలైంది. ప్రత్యేక  పూజలు నిర్వహించి గౌతమ్‌ చేతికి కంకణం కట్టారు. కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల సమక్షంలో కాజల్‌ పెళ్లి వేడుక జరుగుతోంది.


Updated Date - 2020-10-30T07:25:27+05:30 IST