విష్ణుకు తోబుట్టువుగా కాజల్‌!

ABN , First Publish Date - 2020-08-04T07:26:13+05:30 IST

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న హాలీవుడ్‌ - ఇండియన్‌ సినిమా ‘మోసగాళ్లు’. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గిచిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు...

విష్ణుకు తోబుట్టువుగా కాజల్‌!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న హాలీవుడ్‌ - ఇండియన్‌ సినిమా ‘మోసగాళ్లు’. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గిచిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వేసవిలో ఈ చిత్రం విడుదల కావల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో విష్ణు, కాజల్‌ తోబుట్టువులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం కాజల్‌ స్పెషల్‌ వర్క్‌షా్‌పకు హాజరయ్యారు. ఈ విషయాన్ని సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ‘‘చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తోబుట్టువులుగా విష్ణు, కాజల్‌ చక్కని కెమిస్ర్టీ పండిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తాం’’ అని తెలిపారు. బాలీవుడ్‌ యాక్టర్‌ సునీల్‌ శెట్టి, రుహీ సింగ్‌, నవీన్‌ చంద్ర, నవదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ షెల్డన్‌ చౌ పనిచేస్తున్నారు.

Updated Date - 2020-08-04T07:26:13+05:30 IST