కాజల్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

ABN , First Publish Date - 2020-07-28T03:19:10+05:30 IST

కాజల్ అగర్వాల్.. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్. ప్రస్తుతం ఆమె పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ భారీ బడ్జెట్ సినిమాల్లో

కాజల్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

కాజల్ అగర్వాల్.. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్. ప్రస్తుతం ఆమె పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు సాధిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో శంకర్-కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, కొరటాల-మెగాస్టార్ చిరు ‘ఆచార్య’ సినిమాలుండగా, ఇంకా తేజ చేస్తున్న ఓ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఓ విషయం బయటపెట్టింది. ఆమె హీరోయిన్ కాకముందు నుంచే ఎంతో కష్టపడేదట. చిన్నప్పుడే అందరికీ భవిష్యత్‌పై కొంత ఆలోచన ఉంటుంది. తనకి కూడా అలాంటి ఆలోచనలే వచ్చేవట. ఇలాంటి ఆలోచనలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న కాజల్.. ఎట్టకేలకు ఓ చక్కని ఆలోచనకు ఫిక్స్ అయిందట. ఏ పని చేస్తే తన మనసు సంతృప్తికరంగా ఉంటుందో అని తెలుసుకుని ఆ పనికి ఫిక్స్ అవ్వాలని అప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉందట. 


అయితే ఆమెకి ఈ ఆలోచన వచ్చినప్పుడు వయసు ఎంతో తెలుసా? 16 సంవత్సరాలు. అప్పుడే ఆమె ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలో చేరి వర్క్ చేసిందట. ఒక వైపు చదువుకుంటూనే ప్రతి వేసవికి ఏదో ఒక వర్క్ చేస్తూ.. ఫైనల్‌గా హీరోయిన్ అయిన తర్వాత నటనలో.. తన సంతోషాన్ని కనుగొందట. అందుకే సాధ్యమైనంతకాలం నటించడానికి ట్రై చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-07-28T03:19:10+05:30 IST