కాజల్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికొడుకు ఎవరంటే..?
ABN , First Publish Date - 2020-10-05T22:01:20+05:30 IST
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయిన విషయం

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది.
ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకోనుందని, ఇప్పటికే అతనితో నిశ్చితార్థం కూడా పూర్తయిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతకు ముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా అయితే కామ్‌గా ఉందో.. ఇప్పుడు కూడా కాజల్ సైలెంట్‌గానే ఉండటం విశేషం. ప్రస్తుతం స్టార్ హీరోలైన కమల్ హాసన్, చిరంజీవి వంటి వారి సరసన కాజల్ నటిస్తోంది.