తొలిసారి ఆ ప్రయత్నం చేస్తున్న కాజల్
ABN , First Publish Date - 2020-12-01T14:51:30+05:30 IST
వివరాల మేరకు డైరెక్టర్ డీకే తెరకెక్కించే ఓ హారర్ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించనుందట.

హీరోయిన్ కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అసలు కాజల్ సినిమాలు చేస్తుందా? అనే సందేహం చాలా మందికి కూడా వచ్చింది. అయితే అప్పట్లోనే కాజల్ తన కెరీర్‌కు సంబంధించిన క్లారిటీ ఇచ్చేసింది. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని మాత్రమే చెప్పిన కాజల్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో కమల్‌హాసన్ 'ఇండియన్ 2', చిరంజీవి 'ఆచార్య', దుల్కార్ సల్మాన్ సినిమాలున్నాయి. హానీమూన్ ట్రిప్ పూర్తయిన తర్వాత కాజల్ సెట్స్‌లోకి వెళ్లడానికి ఓకే చెప్పేసింది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ఓ కొత్త సినిమా చేయనుంది. వివరాల మేరకు డైరెక్టర్ డీకే తెరకెక్కించే ఓ హారర్ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించనుందట. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కాజల్ ఇన్నేళ్లలో ఓ హారర్ మూవీలోనూ నటించలేదు. తొలిసారి ఓ హారర్ మూవీలో నటించడానికి ఓకే చెప్పింది.
Read more