ఈ డాక్టరేట్ ‘మనం సైతం’ కుటుంబానికి అంకితం: కాదంబరి

ABN , First Publish Date - 2020-08-15T00:33:14+05:30 IST

తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటుడిగా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాదంబరి కిరణ్‌‌కు ప్రముఖ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం

ఈ డాక్టరేట్ ‘మనం సైతం’ కుటుంబానికి అంకితం: కాదంబరి

తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటుడిగా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాదంబరి కిరణ్‌‌కు ప్రముఖ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మనం సైతం’ అంటూ సినీ, సామాజిక రంగాల్లో చేస్తోన్న సేవలకుగాను ప్రతిష్టాత్మిక ‘గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్సిటీ’ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారాడు. యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ పేరుతో స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. నిస్సహాయులకు అండగా నిలబడి సాయం అందిస్తున్న ‘మనం సైతం’ సంస్థకు ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది.


తాజాగా ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ ప్రతిష్టాత్మక గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్శిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు. కొవిడ్ 19 నిబంధనలకు లోబడి.. హైద్రాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియం ఆడిటోరియంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం పొందిన సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... ‘ఈ గౌరవం మనం సైతం సభ్యులకు వినమ్రంగా అంకితం చేస్తున్నాను’ అన్నారు.



Updated Date - 2020-08-15T00:33:14+05:30 IST