‘ఓటీటీ’లో ‘కే 13’కు ఆదరణ

ABN , First Publish Date - 2020-05-04T19:44:26+05:30 IST

ఎస్.పి. సినిమాస్‌ బ్యానర్‌లో భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వంలో అరుల్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘కే 13’.

‘ఓటీటీ’లో ‘కే 13’కు ఆదరణ

ఎస్.పి. సినిమాస్‌ బ్యానర్‌లో భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వంలో అరుల్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘కే 13’.  గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం కే13కి మంచి ఆదరణ లభిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఆ సందర్భంగా ఒక సందేశం విడుదల చేస్తూ ‘గతేడాది ఇదే రోజు మా కల నెలవేరింది. ఆ రోజుని తలచుకుంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని చిత్ర బృందం పేర్కొంది.

Updated Date - 2020-05-04T19:44:26+05:30 IST