శ్యామ్ కే నాయుడు మోసం చేశాడు: ఆర్టిస్ట్ సాయిసుధ

ABN , First Publish Date - 2020-05-27T20:41:21+05:30 IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్యామ్ కే నాయుడు మోసం చేశాడు: ఆర్టిస్ట్ సాయిసుధ

హైదరాబాద్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్యామ్ కే నాయుడు మోసం చేశాడంటూ ఎస్సార్ నగర్ పోలీసులను సాయి సుధ ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శ్యామ్‌తో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, 2015 నుంచి సహజీవనం చేస్తున్నామని చెప్పారు. మొదట్లోనే తనను  పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, అందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్స్, చాటింగ్ టెక్ట్స్‌లు తన దగ్గర ఉన్నాయని సాయిసుధ తెలిపారు. శ్యామ్ ఇంట్లో కూడా తమ విషయం తెలుసని, శ్యామ్ అన్నయ్య చోటా కే నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని చెప్పారని, కానీ ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు ఆగమని చెప్పారని ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు స్పందించడం లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారని సాయి సుధ పేర్కొన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Updated Date - 2020-05-27T20:41:21+05:30 IST