నేనెవరినీ ప్రేమించలేదు: బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ

ABN , First Publish Date - 2020-08-05T15:22:57+05:30 IST

బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ ఉత్తరాదికి చెందిన పారిశ్రామిక వేత్తను ప్రేమించి పెళ్ళి చేసుకుందని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నేనెవరినీ ప్రేమించలేదు: బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ

బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ ఉత్తరాదికి చెందిన పారిశ్రామిక వేత్తను ప్రేమించి పెళ్ళి చేసుకుందని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జూలీ ప్రస్తుతం ‘పొల్లాద ఉలగిల్‌ భయంగర గేమ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. టీవీ కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటోంది. ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తను ప్రేమవివాహం చేసుకున్నట్లు సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తలను చూసి జూలీ దిగ్ర్భాంతి చెందింది. తానెవరినీ ప్రేమించలేదని, పెళ్ళికి తొందరపడలేదని, తమిళ చిత్రసీమలో నటిగా ఉన్నతస్థితికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమని జూలీ తనట్విట్టర్‌లో స్పష్టం చేసింది. పెళ్ళి విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదని, ప్రస్తుతం అంగీకరించిన పలు చిత్రాల్లో నటించాల్సి వుందని జూలీ తెలిపింది.

Updated Date - 2020-08-05T15:22:57+05:30 IST