అయ్యా.. వారసుల్ని దింపాడయ్యా..

ABN , First Publish Date - 2020-12-26T04:04:39+05:30 IST

మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన 'ఆది' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో.. చిన్నా.. ఒక్కసారి తోడకొట్టు

అయ్యా.. వారసుల్ని దింపాడయ్యా..

మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన 'ఆది' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో.. చిన్నా.. ఒక్కసారి తోడకొట్టు చిన్నా.. అంటూ, ఎట్టున్నాడన్నా.. చిన్న అంటూ.. ఆదికేశవరెడ్డి గురించి జైలులో ఉన్న కొందరు వాకబు చేస్తారు. అలాగే యంగ్‌ టైగర్‌ నటించిన మరో చిత్రం బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రంలో కూడా 'అయ్యా.. వారసుడిని దించారయ్యా..' అనే డైలాగ్‌ ఉంటుంది. ఇప్పుడా డైలాగులు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తనయుల విషయంలో సోషల్‌ మీడియాలో మోగిపోతున్నాయి. కారణం ఏమిటని అనుకుంటున్నారా?. క్రిస్మస్‌ సందర్భంగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఇన్‌స్టాగ్రమ్‌లో.. తన కుమారులైన అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లు కలిసి ఉన్న ఫొటోని షేర్‌ చేసి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలలో వారిని చూసిన వారంతా.. పై విధంగా కామెంట్స్‌ చేస్తూ.. ఈ ఫొటోలను ట్రెండ్‌ చేస్తున్నారు.Updated Date - 2020-12-26T04:04:39+05:30 IST