‘ఆర్జీవి’ తో జొన్నవిత్తుల

ABN , First Publish Date - 2020-02-14T09:27:44+05:30 IST

గీత రచయిత జొన్నవిత్తుల మరోసారి మెగాఫోన్‌ చేపట్టారు. బాల కుటుంబరావు పొన్నూరి నిర్మించే ‘ఆర్జీవి’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్‌...

‘ఆర్జీవి’ తో జొన్నవిత్తుల

గీత రచయిత జొన్నవిత్తుల మరోసారి మెగాఫోన్‌ చేపట్టారు. బాల కుటుంబరావు పొన్నూరి నిర్మించే ‘ఆర్జీవి’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం చిత్ర సమర్పకుడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ ‘ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఓ సిద్ధాంతంలా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా రూపొందిస్తున్నాను. ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుంది మార్చి మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 


Updated Date - 2020-02-14T09:27:44+05:30 IST