డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్న హీరో

ABN , First Publish Date - 2020-02-04T21:27:12+05:30 IST

‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స్టాలిన్’. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం.

డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్న హీరో

‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స్టాలిన్’. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి.

 

 తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న భారీగా విడుదలకానున్న సందర్భంగా జీవా పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ‘‘ప్ర‌స్తుతం యాక్ట‌ర్‌గా సంతోషంగానే ఉన్నాను. భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్‌ని కావాల‌నుకుంటున్నాను. రైట‌ర్ కావాలంటే చాలా ఆలోచ‌న‌లు ఉండాలి. బాలీవుడ్‌, టాలీవుడ్ అని కాదు..టెక్నిషియ‌న్స్ అంద‌రూ బాలీవుడ్‌లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. త‌మిళ యాక్ట‌ర్స్ తెలుగులో, తెలుగువారు త‌మిళంలో చేస్తున్నారు. ప్ర‌తిభ ముఖ్యం’’ అన్నారు.

Updated Date - 2020-02-04T21:27:12+05:30 IST