ప్రేమలో.. జయప్రద, రాజేంద్రప్రసాద్‌!

ABN , First Publish Date - 2020-12-21T03:01:30+05:30 IST

అదేంటి జయప్రద, రాజేంద్రప్రసాద్‌ ప్రేమలో ఉండటం ఏమిటి? అని అనుకుంటున్నారు కదా..! ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. ఈ లాక్‌డౌన్‌ పుణ్యమా

ప్రేమలో.. జయప్రద, రాజేంద్రప్రసాద్‌!

అదేంటి జయప్రద, రాజేంద్రప్రసాద్‌ ప్రేమలో ఉండటం ఏమిటి? అని అనుకుంటున్నారు కదా..! ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో.  ఈ లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఓటీటీల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. థియేటర్లు ఓపెన్‌ అవుతున్నప్పటికీ.. ఓటీటీకి స్థాయి మాత్రం పెరిగేలానే కనబడుతుంది. ఇప్పుడు ఓ ఓటీటీ కోసం జయప్రద, రాజేంద్రప్రసాద్‌ ప్రేమించుకుంటున్నారు. తప్పుగా అనుకోకండి. ఓ వెబ్‌ మూవీ కోసమే లెండి. దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య తెరకెక్కించబోయే ఓ వెబ్‌ మూవీ కోసం జయప్రద, రాజేంద్రప్రసాద్‌ కలిసి నటించనున్నారు. ఈ మూవీకి టైటిల్‌గా 'లవ్‌ @ 60' అని ఫిక్స్ చేశారట. 60 సంవత్సరాల వయసులో ఓ జంట ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుందట. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. 

Updated Date - 2020-12-21T03:01:30+05:30 IST