తారక్ ‘వయస్సునామి’ పాటకి జపాన్‌ జంట డ్యాన్స్‌.. చూస్తే షాకే

ABN , First Publish Date - 2020-09-16T00:06:18+05:30 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన డ్యాన్సర్స్‌గా అల్లు అర్జున్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు పేరుంది. వీరి సినిమాల

తారక్ ‘వయస్సునామి’ పాటకి జపాన్‌ జంట డ్యాన్స్‌.. చూస్తే షాకే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన డ్యాన్సర్స్‌గా అల్లు అర్జున్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు పేరుంది. వీరి సినిమాల పాటలు ఇతర దేశాల్లో కూడా అక్కడక్కడా వినబడుతూ ఉంటాయి. ఇక బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇతర దేశాల వారు కూడా ఇప్పుడు తెలుగు సినిమాలంటే ఎంతో ఇంట్రస్ట్ పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ పాటలతో జపాన్‌కు చెందిన ఓ జంట గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తుంది. హిరొ మునిఎరు అనే అతను తన భార్య పిల్లలతో కలిసి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిత్రాలలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. 


ఇటీవల వీరు తారక్‌ 'గోల గోల రంగోలా' అనే అశోక్‌ చిత్రంలోని పాటకు, ఆ తర్వాత 'సింహాద్రి' చిత్రంలోని 'చీమ చీమ చీమా' పాటకు డ్యాన్స్ చేసి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్యామిలీ యంగ్‌ టైగర్‌ మరో చిత్రంలోని పాటతో దిగారు. ఈసారి వాళ్లు చేసిన డ్యాన్స్ మాములుగా లేదు. చూస్తే షాకవ్వాల్సిందే. 'కంత్రీ' చిత్రంలోని 'వయస్సునామి' పాటకు సేమ్‌ టు సేమ్‌ ఎన్టీఆర్‌, హన్సికలా డ్రస్సులు, డ్యాన్స్ చేయడమే కాకుండా.. అదే డ్యాన్స్‌తో ఇంటిలోని పనులు చేస్తూ మెప్పించడం విశేషం. ఫ్లోర్ తుడుస్తూ.. బాత్‌రూమ్ క్లీన్ చేస్తూ.. ఇలా స్టెప్పులను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తూ వారు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంకా నమ్మకపోతే.. పై వీడియో పూర్తిగా చూడండి. ఆశ్చర్యపోతారు.

Updated Date - 2020-09-16T00:06:18+05:30 IST