కరోనా మమ్మల్ని వణికించింది: జాన్వీ కపూర్

ABN , First Publish Date - 2020-06-12T19:29:04+05:30 IST

కరోనా మహమ్మారి తమ కుటుంబాన్ని చాలా భయపెట్టిందని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు,

కరోనా మమ్మల్ని వణికించింది: జాన్వీ కపూర్

కరోనా మహమ్మారి తమ కుటుంబాన్ని చాలా భయపెట్టిందని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించింది. జాన్వి ఇంట్లో పనిచేసే వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో భయంకరమైన వార్త తమ కుటుంబాన్ని వణికించిందని జాన్వి పేర్కొంది. 


జాన్వి ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. లాక్‌డౌన్ గురించి, తమ ఇంట్లో పనిచేస్తున్న వారికి కరోనా సోకడం గురించి మాట్లాడింది. `మా ఇంట్లో పని చేస్తున్న వారిలో ఒక‌రికి కరోనా సోకినట్టు తెలియ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాం. మేమందరం కరోనా టెస్టులు చేయించుకున్నాం. ప‌ని మ‌నుషులకు కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించాం. మరో ఇద్ద‌రికి పాజిటివ్ అని తేలింది. దీంతో మరింత భయపడ్డాం. ప్రస్తుతం ముగ్గురూ కోలుకుని సురక్షితంగా బయటపడ్డార`ని తెలిపింది.  Updated Date - 2020-06-12T19:29:04+05:30 IST