జనవరి 22.. ఏప్రిల్ 28!
ABN , First Publish Date - 2020-12-29T09:48:53+05:30 IST
రంజిత్, షెర్రి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు...

రంజిత్, షెర్రి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నకథతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమా రూపొందించాం. జనవరి 3న నారా రోహిత్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేస్తాం. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందించడం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. జనవరి 22న సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు వీర గనమాల.