నయన్ పాత్రలో జాన్వి!

ABN , First Publish Date - 2020-12-01T22:12:28+05:30 IST

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ చిత్రం `కోలమావు కోకిల`.

నయన్ పాత్రలో జాన్వి!

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ చిత్రం `కోలమావు కోకిల`. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం తెలుగులో `కో కో కోకిల` పేరుతో విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలో హిందీలోకి రీమేక్ కాబోతోంది. 


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 

Updated Date - 2020-12-01T22:12:28+05:30 IST

Read more