మీ అమ్మ లేకపోవడం మంచిదైందని అన్నారు: జాన్వీ

ABN , First Publish Date - 2020-08-25T20:26:02+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తొలి సినిమా `ధడక్`

మీ అమ్మ లేకపోవడం మంచిదైందని అన్నారు: జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తొలి సినిమా `ధడక్` విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అందం, నటన విషయంలో జాన్విని శ్రీదేవితో పోల్చుతూ కొందరు ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో ఎదురైన ఓ విమర్శను మాత్రం జాన్వి మర్చిపోలేకపోయిందట. 


`విమర్శలకు నేను బాధపడను. నన్ను నేను మెరుగుపరుచుకునేందుకే ప్రయత్నిస్తాను. మొదటి సినిమా విడుదల తర్వాత ఓ తీవ్ర విమర్శ ఎదురైంది. `నీ సినిమా చూసేందుకు మీ అమ్మ లేకపోవడం మంచిదైంద`ని ఒకరు కామెంట్ చేశారు. ఆ విమర్శ చాలా కాలం గుర్తుండి పోయింది. అయితే అది నన్ను బాధించకుండా చూసుకున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నాన`ని జాన్వి చెప్పింది. 

Updated Date - 2020-08-25T20:26:02+05:30 IST