జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘ఫాదర్- చిట్టి - ఉమ - కార్తీక్’

ABN , First Publish Date - 2020-12-24T18:19:21+05:30 IST

శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్‌పై జగపతిబాబు ప్రధాన పాత్రలో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘ఫాదర్- చిట్టి - ఉమ -  కార్తీక్’

'అలా మొదలైంది', 'అంతకుముందు.. ఆ తరువాత', 'కళ్యాణ వైభోగమే' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్‌పై జగపతిబాబు ప్రధాన పాత్రలో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫాదర్- చిట్టి - ఉమ -  కార్తీక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యువ జంటగా కార్తీక్, తమిళ నటి అమ్ము అభిరామి నటిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 14గా రాబోతున్న ఈ చిత్రంలో బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటిస్తోంది.


విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని దామోదర్ ప్రసాద్ తెలిపారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 2021 జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు కీలక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2020-12-24T18:19:21+05:30 IST