నా మదిలో మెదిలాయి -జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌

ABN , First Publish Date - 2020-10-14T06:19:22+05:30 IST

లాక్‌డౌన్‌ సమయం మొత్తం ముంబైలోనే గడిపారు జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌. తన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి పేదలకు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు...

నా మదిలో మెదిలాయి -జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌

లాక్‌డౌన్‌ సమయం మొత్తం ముంబైలోనే గడిపారు జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌. తన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి పేదలకు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సల్మాన్‌ వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులంతా సరదాగా గడిపారు. దాదాపు ఏడు నెలల తర్వాత జాక్వలిన్‌ తన తల్లిదండ్రులను చూసేందుకు బహ్రెయిన్‌కు ప్రయాణమయ్యారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఆమె తన విలువైన సమయాన్ని కుటుంబసభ్యులు, చిన్ననాటి స్నేహితులతో గడపాలని అక్కడికి వెళ్లారట. ‘‘బహ్రెయిన్‌లో ప్రజలు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. అక్కడి క్లైమేట్‌ ఎన్నో రకాల ఆలోచనలను పుట్టిస్తుంది. మార్గమధ్యంలో ఉండగా అక్కడి క్యాంప్‌ ఫైర్‌, ద్వీపాలు, ఎడారి సఫారీలు, టిక్కా, షవర్మా అన్ని నా మదిలో మెదిలాయి’’ అని జాక్వలిన్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-14T06:19:22+05:30 IST