గెటప్‌ శ్రీను‌ను ఇంత దారుణంగా అవమానించారా?

ABN , First Publish Date - 2020-04-25T02:50:27+05:30 IST

గెటప్ శ్రీను అంటే తెలియని వారుండరు. బుల్లితెర కమల్ హాసన్‌గా పేరుపొందిన శ్రీను.. వేయని వేషం లేదంటే నమ్మాలి. జబర్ధస్త్‌లో బెస్ట్ స్కిట్స్ చేస్తూ.. టాప్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న

గెటప్‌ శ్రీను‌ను ఇంత దారుణంగా అవమానించారా?

గెటప్ శ్రీను అంటే తెలియని వారుండరు. బుల్లితెర కమల్ హాసన్‌గా పేరుపొందిన శ్రీను.. వేయని వేషం లేదంటే నమ్మాలి. జబర్ధస్త్‌లో బెస్ట్ స్కిట్స్ చేస్తూ.. టాప్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ టీమ్‌కు వెన్నెముకగా పేరు పొందాడు గెటప్ శ్రీను. అయితే ఇప్పుడు గెటప్ శ్రీనుగా అందిరికీ పరిచయం ఉన్న ఈ శ్రీను కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లోని ఓ నిర్మాత ఆయనని ఘోరంగా అవమానించాడట.


‘‘తన కెరీర్ మొదట్లో తన ఫ్రెండ్ చెప్పాడని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్ చూడడానికి వెళ్లాడట. ఆ షూటింగ్ అయిన తర్వాత అక్కడే భోజనం పెడుతుంటే తను కూడా కూర్చున్నాడట. అయితే తను తినబోయే ముందు అటుగా వెళుతున్న నిర్మాత.. ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి.. చేతిలో ఉన్న కంచం లాక్కుని అక్కడి నుంచి పంపించి వేశాడట. అంతే ఆ సీన్ తలుచుకుంటే చాలు కళ్లలో నీళ్లు వస్తుంటాయి...’’ అని శ్రీను చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2020-04-25T02:50:27+05:30 IST