ఇట్స్‌ టైమ్‌ టు... సైబర్‌ క్రైమ్‌!

ABN , First Publish Date - 2020-05-11T08:01:30+05:30 IST

యాంకర్‌, నటి శ్రీముఖి ముఖ్య తారగా నటించిన చిత్రం ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ’. దితిప్రియా భట్టాచార్య, మాయా నెల్లూరి, క్రిష్‌ సిద్దిపల్లి, బాషా మోహిద్దిన్‌ షేక్‌ ఇతర ప్రధాన పాత్రధారులు...

ఇట్స్‌ టైమ్‌ టు... సైబర్‌ క్రైమ్‌!

యాంకర్‌, నటి శ్రీముఖి ముఖ్య తారగా నటించిన చిత్రం ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ’. దితిప్రియా భట్టాచార్య, మాయా నెల్లూరి, క్రిష్‌ సిద్దిపల్లి, బాషా మోహిద్దిన్‌ షేక్‌ ఇతర ప్రధాన పాత్రధారులు. గౌతమ్‌ ఈవీఎస్‌ స్వీయ దర్శకత్వంలో, అల్లం సుభాష్‌తో కలిసి నిర్మించారు. చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా, ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. గౌతమ్‌ ఈవీఎస్‌ మాట్లాడుతూ ‘‘సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. కథంతా నాలుగు పాత్రల చుట్టూ సాగుతుంది. శ్రీముఖిది పూర్తిస్థాయి నిడివి గల పాత్ర కాదు.  కానీ, కీలక పాత్ర చేశారు. ఆమె నటన, పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సీహెచ్‌ వేణుమాధవ్‌, సంగీతం: శేఖర్‌ మోపూరి.


Updated Date - 2020-05-11T08:01:30+05:30 IST