ఇంట్లో బాణీలు కట్టడం కష్టమే!

ABN , First Publish Date - 2020-10-01T06:34:47+05:30 IST

‘‘లాక్‌డౌన్‌లో పని చేశాను. కానీ, ఎక్కడో అసంతృప్తి! దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి ఏది బావుంటుందో చర్చించుకుని సంగీతం చేస్తేనే బావుంటుంది...

ఇంట్లో బాణీలు కట్టడం కష్టమే!

‘‘లాక్‌డౌన్‌లో పని చేశాను. కానీ, ఎక్కడో అసంతృప్తి! దర్శకుడు, నిర్మాత అందరూ కలిసి ఏది బావుంటుందో చర్చించుకుని సంగీతం చేస్తేనే బావుంటుంది. ఇంటి దగ్గర ఒక్కడినే కూర్చుని బాణీలు కట్టడం కష్టంగా అనిపించింది’’ అని అనూప్‌ రూబెన్స్‌ అన్నారు. ఆయన సంగీతమందించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ గురువారం సాయంత్రం ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ ‘‘ఓటీటీలో హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలే ఎక్కువ విడుదలవుతాయి. కానీ, ‘ఒరేయ్‌...’ చక్కటి కుటుంబకథా వినోదాత్మక చిత్రం. ఇంటిల్లపాది కలిసి చూడొచ్చు. ఇందులో ‘ఈ మాయ పేరేమిటో...’ నాకిష్టమైన పాట’’ అన్నారు. ఇంకా అనూప్‌ మాట్లాడుతూ ‘‘బాలుగారితో నేను ఆధ్యాత్మిక పాటలే ఎక్కువ పాడించా. ఏ వయసు వారితో ఆ వయసు వారిలా ఉండటం ఆయన ప్రత్యేకత’’ అన్నారు.

Updated Date - 2020-10-01T06:34:47+05:30 IST