‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉన్నట్లుంది.. లాక్‌డౌన్‌పై సల్మాన్ కామెంట్స్

ABN , First Publish Date - 2020-04-20T18:54:52+05:30 IST

కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌.. తనకు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న భావన కలిగిస్తుందని బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. కేంద్రం

‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉన్నట్లుంది.. లాక్‌డౌన్‌పై సల్మాన్ కామెంట్స్

ముంబై: కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌.. తనకు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న భావన కలిగిస్తుందని బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. కేంద్రం లాక్‌డౌన్ విధించే రెండు రోజుల ముందు సల్మాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఓ రెండు రోజులు ఉండేందుకు వెళ్లారు. కానీ, గత నెల రోజులుగా ఆయన ఆ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ తన లాక్‌డౌన్‌ అనుభవాలను పంచుకున్నారు. లాక్‌డౌన్‌లో తను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నానని తెలిపారు. తన ఫామ్‌హౌస్ బిగ్‌బాస్ హౌస్ ఉందని చెప్పిన సల్మాన్.. ఇంటి నుంచి ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


‘‘నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నాను. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఏం పని చేయాలో.. ఎలా చేయాలో అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. ఇప్పుడు మాత్రం నాకు బిగ్‌బాస్ హౌన్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇక్కడ ఎవరూ ఎలిమినేట్ అవడం లేదు. నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఇంకా చాలా పనులు చేయడం నేర్చుకుంటన్నాను’’ అని సల్మాన్ అన్నారు. కొన్ని పత్రికల కథనాల ప్రకారం సల్మాన్ తన ఫామ్‌హౌస్‌లో తల్లి సల్మా ఖాన్, సోదరి అర్పితా ఖాన్ శర్మ, ఆమె భర్త ఆయుష్ శర్మతో పాటు కొందరు స్నేహితులతో కలిసి ఉన్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-04-20T18:54:52+05:30 IST