క్యారెక్టర్‌ అర్థం కావడానికి ఆరు నెలలు పట్టింది

ABN , First Publish Date - 2020-02-14T09:31:43+05:30 IST

‘‘పది సంవత్సరాలుగా చేసిన సినిమాలతో చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా మాత్రం నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్‌కి రుణపడి ఉంటాను’’..

క్యారెక్టర్‌ అర్థం కావడానికి ఆరు నెలలు పట్టింది

‘‘పది సంవత్సరాలుగా చేసిన సినిమాలతో చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా మాత్రం నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభు సాల్మన్‌కి రుణపడి ఉంటాను’’ అని రానా దగ్గుబాటి అన్నారు. ఆయన కీలక పాత్రధారిగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్‌’ పేర్లతో ఏప్రిల్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. గురువారం తెలుగు ట్రైలర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. రానా మాట్లాడుతూ ‘‘అస్సాంలోని జాదవ్‌ ప్రియాంక్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. 1300 ఎకరాల్లో అడవిని పెంచిన ఘనత ఆయనది. ప్రభు కథ చెప్పాక ఆ క్యారెక్టర్‌ అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. కో యాక్టర్స్‌, ఫోన్‌ అందుబాటులో లేకుండా చాలా రోజులు పనిచేయాల్సి వచ్చింది. దీని వల్ల నేనెవరు? నేనెంటి? అన్న విషయాలు తెలుసుకున్నా. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది. త్వరలోనే మిగతా ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ కథ సురేశ్‌బాబుకు చెప్పడానికి బయలుదేరినప్పుడు ‘ఆయన్ని ఒప్పించడం అంత ఈజీ కాద’ని చాలామంది భయపెట్టారు. ఆయనతో 20 నిమిషాలు మాట్లాడి స్టార్టింగ్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల గురించి మాత్రమే చెప్పాను. తర్వాతి రోజు నుంచి సినిమా ట్రాక్‌లోకి వచ్చేసింది. 30 ఏనుగులతో ఈ సినిమా తీశాం. లీడర్‌ ఏనుగు కోసం ఆడిషన్‌ చేశామంటే మేమంత పర్ఫెక్ట్‌గా సినిమా తీశామో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కోసం రానా తనని తానే అరణ్యగా మార్చుకున్నారు. ఇదొక ఐకానిక్‌ మూవీ అని చెప్పగలను’’ అని అన్నారు. ‘‘అరణ్య’ కథ  విన్నప్పుడు దర్శకుడి ఇమేజినేషన్‌, క్రియేటివిటీ నాకు బాగా నచ్చాయి. ‘ప్రకృతిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం’ అన్నది ఈ సినిమా చెబుతుంది. సొసైటీకి ఎంతో అవసరమైన చిత్రమిది, అని డి.సురేశ్‌బాబు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈరోస్‌ సీఎంఓ మానవ్‌ ేసతీ, డిస్ర్టిబ్యూషన్‌ హెడ్‌ నందు అహుజా, విష్ణు విశాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-14T09:31:43+05:30 IST