కలలా అనిపించింది
ABN , First Publish Date - 2020-10-05T07:54:07+05:30 IST
ఉత్తరాదిలోనూ, దక్షిణాదిలోనూ వైవిధ్యభరితమైన పాత్రలకు, నాయికా ప్రాధాన్యమున్న కథల ఎంపికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు తాప్సీ. ఇప్పుడామె విజయ్ సేతుపతితో...

ఉత్తరాదిలోనూ, దక్షిణాదిలోనూ వైవిధ్యభరితమైన పాత్రలకు, నాయికా ప్రాధాన్యమున్న కథల ఎంపికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు తాప్సీ. ఇప్పుడామె విజయ్ సేతుపతితో కలిసి ఓ పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నారు. దీపక్ సుందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. గత నెలరోజులుగా జైపూర్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తయింది. సెట్‌లో చివరి రోజు దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ‘‘కొన్నాళ్ల క్రితం ఇదొక సుదూరమైన స్వప్నంలా అనిపించింది. ఇప్పుడు షూటింగ్ పూర్తయింది. రోజులు తెలియకుండా గడిచిపోయాయి. అనబెల్లెకు వీడ్కోలు పలికే సమయమిది. త్వరలో థియేటర్స్‌లో కలుద్దాం’’ అని తాప్సీ అన్నారు. ఇందులో విజయ్ సేతుపతి రాజుగా, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.
Read more