సెట్‌లో ఎగ్ దోశెలతో నోరూరించిన హీరోయిన్

ABN , First Publish Date - 2020-03-08T02:31:27+05:30 IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫేమ్ ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న చిత్రం సెట్‌లో సందడి చేశారు. షూటింగ్ భాగంగా ఆమె చిత్ర యూనిట్‌కు ఎగ్ దోశెలు వేసి...

సెట్‌లో ఎగ్ దోశెలతో నోరూరించిన హీరోయిన్

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫేమ్ ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో ఆమె సందడి చేశారు. షూటింగ్‌లో భాగంగా ఆమె చిత్ర యూనిట్‌కు ఎగ్ దోశెలు వేసి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఐశ్వర్యా రాజేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


కాగా ఐశ్వర్యారాజేశ్ తెలుగులో నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’  చిత్రంలో నటిస్తున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌‌కు పరిచయమైన ఐశ్వర్యా తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. లవర్స్ డే సందర్భంగా విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటనకు ఆమె ప్రశంసలు అందుకున్నారు. 

Updated Date - 2020-03-08T02:31:27+05:30 IST