దేవి కాళరాత్రి అవతారంలో యంగ్ హీరోయిన్
ABN , First Publish Date - 2020-10-25T04:13:34+05:30 IST
నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. పురాణాల ప్రకారం రాక్షస సంహారం చేయడానికి రంగును త్యాగం చేసి చీకటిని స్వీకరించడం

నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. పురాణాల ప్రకారం రాక్షస సంహారం చేయడానికి రంగును త్యాగం చేసి చీకటిని స్వీకరించడం ద్వారా అమ్మవారికి కాళరాత్రి అని పేరు వచ్చినట్లుగా చెప్పబడుతోంది. ఈ విషయమే చెబుతూ.. అమ్మవారి అవతారంలో సీరియస్‌గా ఉన్న లుక్స్‌ని యంగ్ హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ అమలాపాల్ ఇప్పటికే నవరాత్రుల గురించి చెబుతూ.. అమ్మవారి అవతారాల గురించి పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రేమకావాలి, పూల రంగడు, శ్రీమన్నారాయణ వంటి చిత్రాలలో నటించిన యంగ్ హీరోయిన్ ఇషా చావ్లా కూడా నవరాత్రులలో అమ్మవారి ఏడవ అవతారం అయిన దేవి కాళరాత్రి గెటప్‌లో దర్శనమిచ్చింది. ''కాళరాత్రి దేవిని ఈ రోజు పూజిస్తారు. చెడును నాశనం చేసి శాంతి మరియు ధర్మాలను ఆమె పునరుద్ధరింపజేస్తుంది.." అని ఇషా చావ్లా పేర్కొంది.