రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

ABN , First Publish Date - 2020-08-08T15:51:45+05:30 IST

`అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు.

రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

`అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు`.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. 


ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు సహాయంగా రూ.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడని ఓ కథనం సర్క్యులేట్ అవుతోంది. ఓ ప్రముఖ పత్రికలో కూడా ఈ వార్త వచ్చింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని తేలింది. షారూక్ నిర్మాణ సంస్థ `రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్` ఈ వార్తను ఖండించింది. షారూక్ అలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. 


Updated Date - 2020-08-08T15:51:45+05:30 IST

Read more