ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నా: ఇంద్రజ

ABN , First Publish Date - 2020-02-26T20:21:57+05:30 IST

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?..

ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నా: ఇంద్రజ

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. ఈ కాన్సెఫ్ట్‌తో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు. గురుపవన్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. 


ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, "ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. శ్రీకాంత్, ఇంద్రజ వంటి ఫెంటాస్టిక్ యాక్టర్లతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా చిన్నవాడ్ని. ఇప్పుడు ఆ సినిమా హీరో శ్రీకాంత్‌గారితో పనిచేస్తుండటం హ్యాపీ. ఇది మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.


నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా ఉంది. నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్ర చేస్తున్నా. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నాకు ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. తన కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ఒక గృహిణిగా నటిస్తున్నా. రెండు రకాల లుక్స్‌లో కనిపిస్తా. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో ఒకేసారి సోలో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

Updated Date - 2020-02-26T20:21:57+05:30 IST