ప్రభాస్‌ చేతులమీదుగా...

ABN , First Publish Date - 2020-08-08T06:51:03+05:30 IST

‘వినాయకుడు’ ఫేమ్‌ కృష్ణుడు నిర్మాతగా మారారు. ఆయన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ సంస్థను ప్రారంభించి నిర్మించిన చిత్రం ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’. శివకుమార్‌ చంద్రవరపు, హర్షితా చౌదరి, వర్షారెడ్డి నటీనటులు...

ప్రభాస్‌ చేతులమీదుగా...

‘వినాయకుడు’ ఫేమ్‌ కృష్ణుడు నిర్మాతగా మారారు. ఆయన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ సంస్థను ప్రారంభించి నిర్మించిన చిత్రం ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’. శివకుమార్‌ చంద్రవరపు, హర్షితా చౌదరి, వర్షారెడ్డి నటీనటులు. లోతుగడ్డ జయరామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రభాస్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణుడికి శుభాకాంక్షలు తెలిపి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘పూర్తిస్థాయి ప్రేమకథ ఇది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. త్వరలో ఓటీటీ వేదికగా విడుదల చేస్తాం’’ అని కృష్ణుడు చెప్పారు. 

Updated Date - 2020-08-08T06:51:03+05:30 IST

Read more