తీవ్రవాద నేపథ్యంలో...

ABN , First Publish Date - 2020-07-12T05:01:33+05:30 IST

చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే...

తీవ్రవాద నేపథ్యంలో...

చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరు సతీమణి సురేఖ చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రకాశ్‌రాజ్‌, సంపత్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్‌ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌, కొంతమంది నేరస్తుల కథల ప్రేరణతో తీవ్రవాద నేపథ్యంలో క్రైమ్‌ డ్రామాగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నట్టు యూనిట్‌ తెలిపింది. ఈ వెబ్‌ సిరీ్‌సలో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉంటాయనీ, అతి త్వరలో ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందనీ సుస్మితా కొణిదెల తెలిపారు.

Updated Date - 2020-07-12T05:01:33+05:30 IST